![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-46.jpg)
ఆకేరు న్యూస్, డెస్క్ : సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడికి సంబంధించి ఆయన సతీమణి కరీనా కపూర్ (KARINA KAPOOR) కీలక విషయాలు వెల్లడించారు. దుండగుడు బాబు వద్దకు రాకుండా సైఫ్ అడ్డుకున్నారని తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(SAIF ALI KHAN)పై గురువారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వైద్యులు సర్జరీ చేశారు. సైఫ్ అలీఖాన్ క్రమంగా కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తాజాగా సైఫ్ సతీమణి కరీనా కపూర్ స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని ఆమె చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కానీ సైఫ్ మాత్రం కేర్‌టేకర్‌ను కాపాడి తన బిడ్డ వద్దకు దుండగుడు వెళ్లకుండా కాపాడారని అన్నారు. దుండగుడు ఇంట్లోని వస్తువులు ఏవీ దొంగలించలేదని వెల్లడించారు.
…………………………………………….