* తెలంగాణకు మొదట్నుంచీ కాంగ్రెస్ విలన్
* నాయకుడు నాయకుడే.. అర్బకుడు అర్బకుడే
* కేసీఆర్ బయటకు వస్తే తెలుస్తుందన్నారు
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణకు మొదట్నుంచీ కాంగ్రెస్ విలన్ అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)విమర్శించారు. కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావట్లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గా ఉంటుందని తెలిపారు. కానీ బయటకు వచ్చినప్పుడు ఎలా పేలుతుందో తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY).. కేసీఆర్ (KCR) పేరు పలకకుండా ఒక్కరోజైనా పాలన చేశారా అని ఎద్దేవా చేశారు. నాయకుడు ఎప్పటికైనా నాయకుడే.. అర్బకుడు ఎప్పటికైనా అర్బకుడే అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వస్తే తెలుస్తుందన్నారు. తెలంగాణ తల్లిని అవమానించే పరిస్థితిని కాంగ్రెస్ తెస్తోందని వాపోయారు. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లి(CONGRESS MOTHER)ని పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లి స్థానంలో రాహుల్ గాంధీ తండ్రిని పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం కాంగ్రెస్ కు శాపం కావచ్చుకానీ, తెలంగాణకు వరం అన్నారు. మేడిగడ్డ ఆనకట్టకు బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం జరిగిందన్నారు.
…………………………………………………………….
