* కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రంగోళి ఉత్సవం
* డ్రగ్స్ మహమ్మారిపై ముగ్గులు వేసిన విద్యార్థినులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాకతీయ ప్రభుత్వ కళాశాల అటానమస్ హనుమకొండ నందు నేడు నశాముక్త అభియాన్, మహిళ, స్త్రీ సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ ఛాలెంజెడ్ హనుమకొండ జిల్లా శాఖ
ఆధ్వర్యంలో విద్యార్థులకు రంగోళి పోటీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిరోధం అనే అంశంపై విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానవ శరీరము ,ఆరోగ్యము, సమాజంపై కలిగే దుష్ప్రభావాలను తెలిపే విధంగా విద్యార్థినులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసైనట్లయితే వారే కాకుండా, వారి తల్లిదండ్రులు ,భవిష్యత్ తరాలన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుందన్నారు ,యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని , అంతేకాకుండా యువత సామాజిక స్పృహ పెంచుకొని సమాజంలోని ఇతరులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రంగోళి పోటీలలో మొదటి ,ద్వితీయ, తృతీయ బహుమతుల పొందిన విద్యార్థిని విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే జిల్లాస్థాయి సమావేశంలో సర్టిఫికెట్స్ అందించబడతాయని
మహిళా స్త్రీ సంక్షేమ శాఖ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్ళు
శ్రీమతి రజినీలత ,డాక్టర్ రాజశేఖర్,యాంటీ డ్రగ్ కమిటీ సభ్యులు డాక్టర్ సమత, డాక్టర్ గంగిశెట్టి
శ్రీనివాస్ జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సీతారాములు
,డాక్టర్ గంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ గన్ సింగ్ ,మహిళా సాధికారత విభాగం కన్వీనర్ డాక్టర్ కోమల
,కళాశాల స్టాఫ్ క్లబ్ సెక్రటరీ రవికుమార్, నశాముక్తాభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తేజస్విని
,వినయ్ పాల్గొన్నారు .
……………………………………………………
