* మరో బస్సు ప్రమాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరోటీ సంభవించింది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువక ముందే కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కర్నూలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులందరూ గాడలో నిద్రలో ఉన్నారు. భారీ వర్షం కారణంగా ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది. తెల్లవారుజామున కావడంతో బస్సు ముందు అద్దాలు తో పాటు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. డ్రైవర్ ప్రమాద సమయంలో చాక చక్యంగా వ్యవహరించడంతోనే పెను ప్రమాదం నుంచి బయట పడ్డామని ప్రయాణీకులు తెలిపారు. ప్రమాద సమయంలో తమకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం నిబంధనలకు విరుద్ధంగా కర్నూల్ నుండి హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో ఆర్టిఏ అధికారులు కేసు నమోదు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా వద్ద దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. ప్రయివేటు బస్సులు రూల్స్‌కు విరుద్ధంగా రోడ్డెక్కితే సీజ్ చెసా్తమని అధికారులు తెలిపారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
