 
                * యాసిడ్ దాడిలో గాయపడ్డ యువతి
* కాలేజీ వెళ్తుండగా బైక్ లపై అడ్డగించిన దుండగులు
* యాసిడ్ దాడిలో చేతులకు తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీకి వెళ్తున్న ఓ యువతిపై జితేందర్ అనే యువకుడు అతడి ఇద్దరు స్నేహితులు కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యువతి కాలేజీకి వెళ్తుండగా బైక్ లపై యువతిని అడ్డగించిన యువకులు ఆమె పై యాసిడ్ చల్లారు. యువతి వెంటనే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకోవడంతో యాసిడ్ దాడి నుంచి ముఖాన్ని కాపాడుకోగలిగింది. కానీ యాసిడ్ దాడిలో చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి, యాసిడ్ దాడికి పాల్పడ్డ జితేందర్ కు ఆ యువతికి ఇంతకు ముందు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డి యువతి ఢిల్లీ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
………………………………………………..

 
                     
                     
                    