![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/images-1-1.jpg)
* బైక్ పై వెళ్తున్న తల్లీ కుమారుడిపై కత్తులతో దాడి
* పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ (Secunderabad)చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమారుడిపై ఐదుగురు దుండగులు కత్తితో దాడి (Murder Attempt)చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యశ్వంత్, రేణుకలపై నడిరోడ్డుపైనే దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న బాధితులను గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
……………………………………….