ఆకేరున్యూస్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని దానిపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. వాట్సప్్పై నిషేధం విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముందుగా అక్కడి హైకోర్టును ఆశ్రయించాడు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి యూరప్‌లో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోన్న వాట్సప్, భారత్‌లో మాత్రం ఇక్కడి చట్టాలను పాటించేందుకు నిరాకరిస్తోందని తెలిపారు.
……………………………..