* మార్కెట్ కమిటీ చైర్మన్గా తౌటం ఝాన్సీ రాణి
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా తౌటం ఝాన్సీ రాణి పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి తో పాటు వైస్ చైర్మన్ గా దేశిని ఐలయ్య గౌడ్ డైరెక్టర్లుగా గట్టు శ్రీధర్ గౌడ్ ,సముద్రాల కృష్ణ, అక్కినపల్లి బిక్షపతి, వంటకాల అనిల్ రెడ్డి, కిన్నెర కృష్ణమూర్తి, మిల్కూరి శ్రీనివాస్, ఎండి యాకోబ్ అలీ ,కెత్తే విజయేందర్, నిగ్గుల లింగయ్య , మిల్కూరి శ్రీను తదితరులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి రాజు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ , రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుదిల్ల శ్రీధర్ బాబులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నూతన మార్కెట్ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కమలాపూర్ మండలంలోని రైతులు పండించిన పంటలను విక్రయించడానికి దూరప్రాంతాలకు వెళ్లకుండా కమలాపూర్ మార్కెట్ యార్డులోనే అన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుండపు చరన్ పటేల్, తౌటం రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆన్ కార్ అశోక్, జి డాక్టర్ మౌటం, కుమారస్వామి, కంభంపాటి ప్రసాద్, వైనాల సాంబయ్య ,మసన చంద్రశేఖర్, గంధసిరి బిక్షపతి ,పుల్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
