Bandi Sanjay Hindu Festivals
* కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు
* గోల్డెన్ టెంపుల్‌గా భాగ్యలక్ష్మి ఆలయాన్ని మారుస్తామని వెల్లడి
* సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హిందువుల పండగలపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ వివక్ష చూపుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు హిందూ పండగలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. 2029లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ప్రకటించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరగాలో జరిపి చూపిస్తామని, మీ కళ్లు తెరిపిస్తామని అన్నారు.
* ఆయనా ఇవ్వలే.. ఈయనా ఇవ్వలే..
కేసీఆర్ ఈడకు వచ్చిన సందర్భంలో సింహవాహిని దేవాలయానికి రూ.20 కోట్లు ఇస్తామని ప్రకటించారని, ఇచ్చిరా అని అక్కడి వారిని ప్రశ్నించారు. అలాగే వేములవాడకు వచ్చి 100 కోట్లు అన్నారని, కొండగట్టుకు పోయి 100 కోట్లు అన్నారని, దేనికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆయనా ఇవ్వలే.. ఈయనా ఇవ్వలే అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వాళ్లు ఇచ్చిన దాని కంటే 50 వేలు పెంచి గొప్పలు చెప్పుంటున్నారని అన్నారు.
* అమృత్ సర్ గురుద్వార తరహాలో..
2029లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని, తాము అధికారంలోకి రాగానే అమృత్ సర్ గురుద్వారలో గోల్డెన్ టెంపుల్ ఎలా ఉందో అలా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మారుస్తామని బండి సంజయ్ తెలిపారు. సింహవాహిని అమ్మవారి బోనాల పండుగను బ్రహ్మాండంగా జరిపిస్తామని హామీ ఇచ్చారు. హంగు ఆర్భాటాలు, అన్ని సౌకర్యాలతో హిందూ పండగలను జరిపించే బాధ్యత తమదన్నారు.
* వారికి 33 కోట్లు.. మనకు 20 కోట్లా..
హైదరాబాద్‌లో 3,500 ఆలయాలు ఉన్నాయని వాళ్లు ఇచ్చే నిధులు ఎలా సరిపోతాయని బండి ప్రశ్నించారు. 80 శాతం హిదువులు ఉండే పండుగకు 20 కోట్లు ఇచ్చారని, 20 శాతం ఉండే వారి పండగకు 33 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. వాళ్లకు ఇవ్వడాన్ని తాను అడగడం లేదని, తమకెందుకు ఇవ్వడం లేదనేదే తన ప్రశ్న అన్నారు. తనకు సనాతన ధర్మం ముఖ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ముఖ్యం తప్ప, తనకు రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. ఇట్లనే బిచ్చమొత్తుకు బతుకుదామా, సంఘటితంగా మారి ప్రశ్నిద్దామా హిందూ సమాజం ఆలోచించాలని బండి సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
