BOI Recruitment 2026
* బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌కు భారీ అవకాశం!
* క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి BOI నోటిఫికేషన్..
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ స్కేళ్లలో 779 క్రెడిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు 20 జూలై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* పోస్టుల వివరాలు
క్రెడిట్ ఆఫీసర్ (MMGS-II) – 677 పోస్టులు
క్రెడిట్ ఆఫీసర్ (MMGS-III) – 61 పోస్టులు
క్రెడిట్ ఆఫీసర్ (MMGS-IV) – 41 పోస్టులు
* మొత్తం ఖాళీలు: 779
* అర్హతలు ఏమిటి?
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అలాగే పోస్టులను బట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్, క్రెడిట్ విభాగాల్లో అనుభవం ఉండాలి. పూర్తి విద్యార్హతలు, అనుభవ ప్రమాణాలు అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటాయి.
* అర్హత వయస్సు..
MMGS-II పోస్టులు: 25 నుంచి 32 సంవత్సరాలు
MMGS-III పోస్టులు: 28 నుంచి 35 సంవత్సరాలు
MMGS-IV పోస్టులు: 30 నుంచి 40 సంవత్సరాలు
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
* వేతన వివరాలు..
MMGS-II: రూ.64,820 – రూ.93,960
MMGS-III: రూ.85,920 – రూ.1,05,280
MMGS-IV: రూ.1,02,300 – రూ.1,20,940
జీతంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
* ఎంపిక ఎలా ఉంటుంది?
నియామక ప్రక్రియలో ఈ దశలు ఉంటాయి:
* ఆన్లైన్ పరీక్ష
* వ్యక్తిగత ఇంటర్వ్యూ
* తుది మెరిట్ జాబితా
* ఆన్లైన్ పరీక్ష విధానం
ఆన్లైన్ పరీక్షలో మొత్తం 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
* దరఖాస్తు ఫీజు..
C/ST/PwD అభ్యర్థులు: రూ.175/-
జనరల్, OBC, EWS అభ్యర్థులు: రూ.850/-
* ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30 జూన్ 2026
* దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూలై 2026
* ఎక్కడ దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.bankofindia.co.in ( https://bankofindia.bank.in/career/recruitment-notice) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
