* భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
* హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణలో బతుకమ్మ సంబురాలు కనులపండువగా మొదలయ్యాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉత్సాహపూరిత వాతావరణంలో మహిళలు బతుకమ్మ ఆడి.. పాడారు. రాష్ట్రమంతా వేడుకల ప్రారంభానికి ఒకరోజు ముందే కూకట్పల్లిలో బతుకమ్మ ఆడడం సంప్రదాయంగా వస్తోంది. కాగా ఈరోజు సాయంత్రం హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు హాజరవుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు విచ్చేయనున్నారు. నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. దీంతోపాటు ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
…………………………………………..
