
* తెలంగాణ సీఎం సహా ప్రముఖుల హాజరు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీ జంతర్ మంతర్ (Janthar Manthar) వద్ద బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలనూ బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే తెలంగాణ శాసనసభలో తీర్మానం పెట్టారని అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ పెట్టి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy), మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, సీపీఐ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ జంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని, మహిళా రిజర్వేషన్లలో 33 శాతం బీసీ మహిళా నేతలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపట్టిన కులగణన అనంతరం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం లభించింది. కేంద్రం దాన్ని ఆమోదించి అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
………………………………………………..