* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నయా మోసానికి తెర లేపిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఖానాపురం మండలం బుదరావుపేట గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచి, బీసీ లకు 42% ఇచ్చి ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తానని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడితో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల ఓట్లు దండుకుని తీరా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను నయా మోసానికి తెరలేపింది.అసెంబ్లీ సాక్షిగా మేము చట్టబద్ధం చేయలేమని చేతులెత్తేసి మా పార్టీ పక్షాన బీసీలకు 42 శాతం ఇస్తామని,ఇతర పార్టీలు కూడా ఇవ్వాలని మరో మోసానికి పూనుకుంటున్నదన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసమే బిసి రిజర్వేషన్ కాకుండా కేద్రానికి బాధ్యత అప్పగించిందన్నారు.కెసిఆర్ సారథ్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణ సర్వేలో లేదనేది స్పష్టంగా అర్థమవుతున్నధన్నారు .ఎన్నికలకు ముందు కేసీఆర్ విడుదల చేసిన 5000 రూపాయలు మాత్రమే రైతుబంధు కింద రైతులకు ఖాతాలో వేసి చేతులు దులుపుకున్నారన్నారు.రైతులకు డబ్బులు విడుదల చేశాకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు రైతుల చెప్పుల దండలే స్వాగతం పలుకుతాయన్నారు.మోసపోయిన ప్రజల చెప్పుల దండలే స్వాగతం పలుకుతాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదీ లేదని పెద్ది ఏద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సర్వేలో నిబద్ధత లేదు..
రిజర్వేషన్లు పెంచి, బీసీ లకు 42% ఇచ్చి ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తానని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడితో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల ఓట్లు దండుకుని తీరా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను నయా మోసానికి తెరలేపింది.అసెంబ్లీ సాక్షిగా మేము చట్టబద్ధం చేయలేమని చేతులెత్తేసి మా పార్టీ పక్షాన బీసీలకు 42 శాతం ఇస్తామని, ఇతర పార్టీలు కూడా ఇవ్వాలని మరో మోసానికి పూనుకుంటున్నదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసమే బిసి రిజర్వేషన్ కాకుండా కేంద్రానికి బాధ్యత అప్పగించిందన్నారు. కెసిఆర్ సారథ్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణ సర్వేలో లేదనేది స్పష్టంగా అర్థమవుతున్నధన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ విడుదల చేసిన 5000 రూపాయలు మాత్రమే రైతుబంధు కింద రైతులకు ఖాతాలో వేసి చేతులు దులుపుకున్నారన్నారు.రైతులకు డబ్బులు విడుదల చేశాకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు రైతుల చెప్పుల దండలే స్వాగతం పలుకుతాయన్నారు.మోసపోయిన ప్రజల చెప్పుల దండలే స్వాగతం పలుకుతాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదీ లేదని పెద్ది ఏద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………