
* కొత్వాల్ గూడలో కొత్త కొలను..
* రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో ఏర్పాటు
*లగ్జరీ హోటళ్లు,వేవ్ పూల్స్ పార్కులు,సైక్లింగ్ ట్రాక్ లు,ఫ్లోటింగ్ విల్లాలు,అడ్వెంచర్ స్పోర్ట్స్
*సరికొత్త హంగులతో ఏడాది చివర్లో పనులు ప్రారంభం
ఆకేరు న్యూస్ డెస్క్: సముద్రం చూడాలి.. బీచ్ లో గడపాలి అనుకునే వారు రానున్న రోజుల్లో ఏ గోవా(GOA)కో,,బాంబే(MUMBAI)కో..చైన్నై(CHENNAI),విశాఖ ఫట్నం,(VISHAKAPATNAM) కాకినాడ(KAKINADA) ,చీరాల(CHIRALA) లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఇక బీచ్(BEECH) అందాలను మన హైదరాబాద్ లోనే చూడొచ్చు..హైదరాబాద్ సముద్రతీరాన లేదు కదా మరి బీచ్ అందాలను ఎలా అస్వాదించవచ్చు అనుకుంటున్నారా.. తెలంగాణలో బీచ్ లేదనే కొరతను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కే ఓ చిన్నపాటి సముద్రాన్ని బీచ్ అందాలను రప్పిస్తోంది. హైదరా బాద్ వాసుల ముందు బీచ్ అందా లు ఆవిష్కృతం చేసేందుకు తెలం గాణ రంగం సిద్ధం చేస్తోంది. చార్మినార్(CHARMINAR),మక్కామసీద్(MECCA MASJID),గోల్కొండ కోట(GOLKONDA FORT) ,ఫలక్ నామా ప్యాలెస్,(FALUKNAUMA PALACE) చౌ మహల్లా,(CHOW MAHALLA)సాలార్ జంగ్ మ్యూజియం లాంటి చారిత్రిక కట్టడాలతో పాటు, గండిపేట,హుసేన్ సాగర్,బుద్దపూర్ణిమ,అంబేద్కర్ విగ్రహం,(SALARJUNG MUSEAM) నూతన సెక్రటేరియట్, సమతా మూర్తి (SAMATHA MURTHY) విగ్రహం లాంటివి ఇప్పటికే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.. ఇప్పటికే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది .గచ్చిబౌలి,ఫైనాన్షియల్ సిటీ ప్రాంతాలు విదేశాలను తలపించేలా అభివృద్ధి చెందాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ సిటీలో ప్రయాణిస్తూ సిటీ అభివృద్ది చెందుతున్న తీరు చూసి ఆశ్చర్య పోయారట..
బీచ్ లేదన్న కొరత..
సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న సిటీ అందాలు వేరే ఉంటాయి. సముద్ర తీరాలు పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తాయి..బీచ్ అందాలు చూడాలంటే ఎక్కడికో వెళ్లకుండా ప్రభుత్వం హైదరాబాద్ లోనే ఆర్టిఫిషియల్ బీచ్ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది. రూ. 225 కోట్లతో 35 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ లేక నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.హైదరాబాద్ లోని కోత్వాల్ గూడ సమీపం లో ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరగా ఉండే విధంగా బీచ్ ను కొత్త సరస్సును, బీచ్ ను నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద రూ.225 కోట్ల అంచ నా వ్యయంతో దీనిని నిర్మించబోతు న్నారు. అది కూడా ఈ డిసెంబర్ మాసం లోనే లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన కా ర్యాచరణ కూడా ప్రభుత్వం ప్రారం భించింది.నిజమైన బీచ్ కు ఏమాత్రం తీసిపో ని విధంగా దీనిని నిర్మించనున్నా రు.
అంతర్జాతీయ స్థాయి హంగులతో..
అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ కొత్త బీచ్ నిర్మాణం జరుగనున్నది. స్టార్ హోటళ్ళు, అద్భుతమైన స్టే హోటళ్లు. అలలపై తేలియాడే వి ల్లాలు ఆకట్టుకోనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీ తాకాలపు క్రీడలు వంటి సాహస క్రీ డలు ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రా క్ లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చే సేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థి యేటర్లు, అలంకార ఫౌంటెన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉం డనున్నాయి. బీచ్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలనూ ఏర్పా టు చేయబోతున్నారు.
……………………………………………….