* మహిళా దారుణ హత్య
* నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలు
* 10 ప్రత్యేక బృందాలతో నిందితుని కోసం గాలింపు
* సవాల్‌గా తీసుకున్న సీపీ సాయి చైతన్య
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : దారుణం చోటు చేసకుంది. నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది.
నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మొండెం లేని గుర్తు తెలియని మహిళా మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి తల నరికి.. చేతుల వేళ్లు సగం వరకు తెగి ఉన్నాయి. బాసర ప్రధాన రహదారి పక్కన పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు శనివారం తెల్లవారు జామున చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న స్థానిక ఎస్ ఐ తిరుపతి హత్య జరిగినట్లు భావించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సీపీ సాయి చైతన్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మొండెం ఒక చోటా.. మృతదేహాం మరోచోటా ఉండడంతో.. అత్యాచారిని ఒడిగట్టిన దుండగులు.. దారుణంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు హత్యకు గురవ్వడంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల్లోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సీపీ సాయిచైతన్య సవాల్‌గా తీసుకొని అన్నీ కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
……………………………………………..
