
* అన్న కొడుకును బలి ..!
* రాజస్థాన్ లో దారుణం
ఆకేరు న్యూస్ డెస్క్ : మానవత్వం మంటకలిసింది. మూఢనమ్మకాలు పరాకాష్టకు చేరుకుంటే ఎంత దారుణాలు జరుగుతాయో ఇలాంటి సంఘటనల గురించి వింటే తెలుస్తోంది. ఓ మాంత్రికుడి మాటలు నమ్మి భార్య పుట్టింటి నుంచి తిరిగి రావాలని అన్న కొడుకునే బలి ఇచ్చాడు ఓ ప్రబుద్దుడు . రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారాలో జులై 19న ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ లోని సారాయ్ కలాన్ గ్రామానికి చెందిన మనోజ్ ప్రజాపత్ తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిందని భార్యను తీసుకురావాలని ఆరేళ్ల మేనళ్లుడిని బలి ఇచ్చాడు. మనోజ్ ప్రజాపత్ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు . ఈ నేపధ్యంలో మనోజ్ ప్రజాపత్ భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురైన ప్రజాపత్ సునీల్ అనే మాంత్రికుడిని ఆశ్రయించాడు. తన భార్య తిరిగి తన వద్దకు రావాలని మాంత్రికుడిని కోరాడు. భార్య తిరిగి రావాలంటే ఓ బాలుడిని కాళీ మాతకు బలి ఇవ్వాల్సి ఉంటుందని. బాలుడి రక్తం, హృదయం తీసుకురావాలని వాటితో పాటు 12 వేల రూపాయలు తీసుకురావాలని మాంత్రికుడు కోరగా మాంత్రికుడు చెప్పినట్టుగా స్వయానా తన అన్న కొడుకు అయిన ఆరేళ్ల లోకేష్ ను ఎత్తికెళ్లి ఓ పాడుపడిన ఇంట్లో దారుణంగా హత్య చేశాడు. బాలుడిని చంపిన తరువాత అతడి శరీర భాగాల నుంచి సిరంజి ద్వారా రక్తం తీసి బాలుడి శరీరంపై గడ్డి కప్పి వెళ్లిపోయాడు. అదే రోజు లోకేష్ కుటుంబ సభ్యులు లోకేష్ హత్య చేయబడ్డాడు అని గుర్తించారు. బాలుడి సోదని ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజాపత్ ను అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ప్రజాపత్ తో పాటు మాంత్రికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
……………………………………………………………..