Bengaluru water crisis | సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో గతంలో ఎన్నడూ కనీవిని ఎరగని స్థాయిలో నీటి సంక్షోభం సంభవించింది. ఎండలు ఇంకా ముదరక ముందే ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో నీటి పొదుపు చర్యలు చేపట్టాయి. నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ వాహనాలను నీటితో కడగడంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ కార్యకలాపాలపై కూడా సొసైటీలు నిషేధించాయి. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు డిస్పోజబుల్ ప్లేట్లు, చేతులు, ముఖం కడుక్కునేందుకు ‘వెట్ వైప్స్’ వినియోగించాలని కోరడం బెంగళూరులో నీటి సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది
అత్యవసర చర్యలు
తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నీటిపారుదల, వాణిజ్య బోర్వెల్లను స్వాధీనం చేసుకోవడం, నగరంలోని ప్రతి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌ను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా స్వతహాగా పొదుపు చర్యలు అమలు చేస్తున్నారు. కార్లు, వాహనాలు, బాల్కనీలు కడగడం మానేయాలని, సగం బకెట్ నీటితో స్నానం చేయాలని, వాషింగ్ మెషీన్ల ఎకానమీ సైకిల్ వాడకంతోపాటు వాటి ఉంచి వచ్చే వ్యర్థ నీటిని తిరిగి ఉపయోగించాలని సూచనలను జారీ చేస్తున్నారు. ఆక్వాగార్డ్ ఫిల్టర్ల నుండి వచ్చే నీటితో ఫ్లోర్, బాత్రూమ్లను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు
బెంగుళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB)కి ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డికె. శివకుమార్ ( DK Shivakumar ) మార్చి 4 న ఆదేశాలు జారీ చేశారు, నీటి ఎద్దడి తీవ్రతను అంగీకరిస్తూ నగరంలోని అన్ని వాణిజ్య బోర్వెల్ల బాధ్యత తీసుకోవాలని నీటి నిర్వహణ సంస్థలను ఆదేశించారు.
‘‘తమ రికార్డుల ప్రకారం.. 16,781 బోర్‌వెల్స్‌లో 6,997 బోర్లు ఎండిపోయాయి. మిగిలిన 7,784 పని చేస్తున్నాయి. ప్రభుత్వం కొత్త బోర్వెల్లు వేయనుంది’’ అని డీకే శివకుమార్ మీడియాకు వివరించారు.
శివకుమార్ మాట్లాడుతూ, ట్యాంకర్ మాఫియాను నియంత్రించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రైవేట్ కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్లో నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం నీటిని సమర్థవంతంగా పంపిణీ చేయవచ్చన్నారు.కొన్ని రోజులుగా ట్యాంకర్లు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ట్యాంకర్‌కు రూ. 500 నుండి రూ. 2,000 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 కరువు బారిన పడ్డాయి, 219 తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కావేరి నదిలో నీటి ప్రవాహనం లేకపోవడంతో బెంగళూరు ప్రధాన నీటి వనరులైన బోర్వెల్లు రెండింటినీ ప్రభావితం చేసినట్లు ఒక అధికారి తెలిపారు. “రాబోయే రోజుల్లో సరైన వర్షాలు లేకపోతే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కారణాలు ఏంటి?
బెంగళూరు నగరంలో నీటి సరఫరా చేసే BWSSB, సంక్షోభాన్ని ముందుగానే ఊహించినట్లు పేర్కొంటుండగా, వేసవి నెలలలో సకాలంలో పరిష్కారాలను కనుగొనడంలో విఫలమైంది.
అతి తక్కువ వర్షపాతం కారణంగా నగరంలో భూగర్భ నీటి మట్టం తగ్గిపోయింది.
ష భారీ పట్టణీకరణ కారణంగా చెరువులు, కుంటలు కుదించుకుపోయి చివరకు ఎండిపోతున్నాయి.
Read Also : ఈ చిన్నోడి సమయస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేం.. చిరుతపులిని బంధించాడు.