
* వైద్యులకు జగిత్యాల కలెక్టర్ ఆదేశం
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
ఆకేరు న్యూస్ ,జగిత్యాల : రోగులకు మెరుగైన సేవలు అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. O.P. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి ఫీవర్ రిజిస్టర్లను పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు డైట్ ఫుడ్ పాలు ఇడ్లీ బ్రెడ్ ఫ్రూట్స్ పోషక ఆహార పదార్థాలు అందించాల ని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా పై అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఆవరణంలో పేషంట్ల గదులను శుభ్రంగా ఉండేలా చూడాలి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఆవరణంలో పిచ్చి మొక్కలు ముండ్ల చెట్లను తొలగించి వెంటనే పండ్ల చెట్లను జామ నిమ్మ వంటివి పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.కలెక్టర్ వెంట డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
…………………………………….