ఆకేరున్యూస్,న్యూఢల్లీి : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రెండు రాష్టాల్ర ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు. ఇక మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించగా.. అందులో తెలంగాణ రాష్టాన్రికి చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాధ్యతలు అప్పగించారు.
…………………………………..