
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ ఏసీపీగా యం. భోజరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఖమ్మం క్రైమ్ ఏసీపీగా పనిచేస్తున్న భోజరాజు ను వరంగల్ క్రైం ఏసీపీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేసింది. 1995 బ్యాచ్ చెందిన భోజరాజు గతంలో వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్బంగా అధికారులు సిబ్బంది నూతన క్రైం ఏసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.