
* అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి
ఆకేరు న్యూస్, ములుగు జిల్లా : పేదల కన్నీటిని తుడిచేందుకే భూభారతి (Bhoo Bharathi) తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి అవగాహనా సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు, ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారని అన్నారు. గతంలో ధరణి (Dharani) గురించి ఎక్కడైనా రెవెన్యూ సదస్సులు పెట్టారా అని ప్రశ్నించారు. చేసిన తప్పులను గత ప్రభుత్వం ఇప్పటికీ గ్రహించడం లేదని విమర్శించారు. ధరణి చట్టంలో సాదాబైనామాల అంశం ఎత్తేశారని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల న్యాయమైన సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధరణనిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల ముందే చెప్పామని, ఇందిరమ్మ రాజ్యంలో చెప్పింది చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
………………………………………..