![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-6.jpg)
* రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఆకేరున్యూస్, హైదరాబాద్: అల్లు అర్జున్‌కి భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే… ఈ మరణానికి అల్లు అర్జునే కారణమంటూ ఆయనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
…………………………………