* మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరణ
* రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారనేది అపొహే
* ఓటుకు నోటు కేసులో జగదీష్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు
ఆకేరు న్యూస్ డెస్క్: ఓటుకు నోటు(Vote For Note) కేసులో నిందితుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanthreddy) ఉన్నారని, ఈనేపథ్యంలో కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత జగదీష్ రెడ్డి (Brs Leader Jagadish Reddy)వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(SuprimCourt) ధర్మాసనం ఈరోజు తీర్పు వెల్లడించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌ను ఆదేశిస్తూనే, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారనేది అపోహే అని పేర్కొంది. జగదీష్ రెడ్డి పిటిషన్‌ను ఎంటర్టైన్ చేయలేమని పేర్కొంది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే, పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. అలాగే, రేవంత్‌కు కేసు విషయాలు రిపోర్టు చేయవద్దని ఏసీబీ(Acb)ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
————————————————–