* అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు
* గతంలో చెరువు ఎఫ్టీఎల్లో గోడ నిర్మించిన మల్లారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సుచిత్ర వద్ద సర్వే నెంబర్ 82 లోని భూ వివాదం కొలిక్కి రాకముందే.. మరో అంశంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులుషాక్ ఇచ్చారు. చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన గోడను కూల్చివేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ జిల్లా జొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్ టీఎల్ స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గతంలో స్థానికులు చాలా మంది మల్లారెడ్డిపై ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ఆయనపై చర్యలు ఎప్పుడూ లేవు. తాజాగా కాంగ్రెస్ సర్కారులో అధికారులు మల్లారెడ్డికి షాక్ ల షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా.. పెద్ద చెరువు పరిధిలో నిర్మించిన గోడను ఎక్స్ కవేటర్ సహాయంతో కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేసి ప్రభుత్వ బోర్డును పాతారు. దీనిపై మల్లారెడ్డి ఇప్పటి వరకూ స్పందించలేదు. ఆయన అనుచరులు అక్కడకు చేరుకున్నప్పటికీ, అధికారులు కూల్చివేతలు కొనసాగించారు.
——————-