Operation Ganga Bhagyashri Borse
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సినీ అభిమానులకు మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సిద్ధమవుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆపరేషన్ గంగా’లో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆమె మాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు.
* యుద్ధం.. భారతీయుల తరలింపు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన భారీ తరలింపు కార్యక్రమమే ‘ఆపరేషన్ గంగా’. ఈ వాస్తవ ఘటనల నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
యుద్ధ వాతావరణం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్వదేశానికి చేరుకోవాలనుకునే భారతీయులు.. వారిని రక్షించేందుకు జరిగే సాహసోపేతమైన ప్రయత్నాలు.. ఈ అంశాల చుట్టూ సినిమా కథనం సాగనున్నట్లు తెలుస్తోంది.
* భాగ్యశ్రీకి కీలక పాత్ర
‘మిస్టర్ బచ్చన్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేకు ‘ఆపరేషన్ గంగా’లో ప్రాధాన్యమైన పాత్ర దక్కినట్లు సమాచారం. ఇంతటి భారీ దేశభక్తి, సర్వైవల్ థ్రిల్లర్‌లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్‌తో కలిసి ఆమె నటించనుండటంతో ఈ సినిమా ఆమె కెరీర్‌కు మరో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ చిత్రానికి విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో జాతీయ అవార్డు అందుకున్న ‘మెప్పడియాన్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఆపరేషన్ గంగా’తో మోహన్‌లాల్, విష్ణు మోహన్ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ అందించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
