
* రూ. 85 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్
* పోలీసుల అదుపులో 9 మంది నిందితులు
* వారిలో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్
* నిందితుల వద్ద తుపాకీ, బుల్లెట్లు కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు భారీ డ్రగ్స్ ముఠాను ఈరోజు అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది డ్రగ్ ప్లెడర్ల(Drug Peddlers)ను అరెస్టు చేశారు. వారి నుంచి పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Cv Anand) చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వినియోగదారుడిని పట్టుకుని విచారించగా, ఈ డ్రగ్స్ ముఠా లింకు బయటపడింది. తొలుత డ్రగ్స్ కేసులో రవివర్మ, సచిన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకున్నారు. విచారణలో వారి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. కొకైన్ సరఫరా చేస్తున్న ఆరుగురు, మెఫిడ్రీన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. రవివర్మకు ముంబయికి చెందిన డ్రగ్ ముఠాతో సంబంధాలున్నాయి. ముంబయిలో వాహెద్ అనే వ్యక్తికి విదేశాల నుంచి కొకైన్ వస్తున్నట్లు విచారణలో తేలింది. ముంబయిలోని వాహిద్ నుంచి నిందితులు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నారు. నిందితుల్లో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్సటసీ సీజ్ చేశారు. కాటేదాన్ (Katedhan) లో డ్రగ్స్ దందా చేస్తున్న మరో వ్యక్తిని కూడా పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన పవన్ భాటియాను అరెస్టు చేశామన్నారు. హేమ్ సింగ్ అనే వ్యక్తితో కలిసి కాటేదాన్ లో డ్రగ్స్ అమ్ముతున్నాడు. నిందితులు ముందుజాగ్రత్తగా భావించి రివాల్వర్, బుల్లెట్లు కూడా కొనుకున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన డీసీపీ, ఇతర బృందాన్ని సీపీ అభినందించారు.
………………………………………………….