* కసరత్తు ప్రారంభించిన ఎన్నికల కమిషన్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మరో రెండు నెలల్లో బిహార్ అసెంబ్లీ గడువు పూర్తికానుంది. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 22తో బీహార్ బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. నవంబర్ 5 నుంచి 15 తారీఖు మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చట్ పూజ వేడుకలు ముగిసిన తరువాత మూడు దశల్లో బీహార్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ బీహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన సంస్కరణలపై పలు ఆరోపణలు వస్తున్నాయి, పార్లమెంట్ లో ప్రతిఫక్ష నాయకుడు బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు అయింది. సెప్టెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది. తుది జాబితా చట్టవ్యతిరేకంగా ఉన్నట్లయితే మొత్తం ఓటరు లిస్టును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ లో నితీష్ కుమార్ సీఎంగా ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.
………………………………………………..
