ఆకేరున్యూస్, ఉట్నూర్: గిరిజన గ్రామాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏలకు 10చొప్పున 40 బైక్ అంబులెన్స్ లను మంజూరు చేసింది. ప్రతీ బైక్ అంబులెన్స్ కు ఒక ఈఎంటీని నియమించి మారుమూల గ్రామాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేలా ఆయా ప్రాంతాల ఐటీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశించారు. బైక్ అంబులెన్స్ లకు కావల్సిన ఆక్సీజన్ సిలిండర్లు, బ్యాగులు, అమరాన్ బ్యాటరీలు, గ్లూకోమీటర్లు, పల్స్ యాక్సీ మీటర్లను ఆయా ఐటీడీఏలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు.
—————————-