* అమెరికాలో జరిగిన డిబేట్‌పై కేటీఆర్ స్పందన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమెరికా డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్((Kamala Harris) పై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) స్పందించారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump), హారిస్ మధ్య డిబేట్ జరిగిన తీరుపై ఆయన ట్విటర్ (ఎక్స్ )లో ట్వీట్ చేశారు. ఈ చర్చలో ఆమె ట్రంప్‌పై చేసిన దాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రంప్ పాలనలో అమెరికాలో జరిగిన లోటుపాట్లను ఆమె ఎత్తిచూపారు. దీంతో కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అంటూ కేటీఆర్ కొనియాడారు. ‘డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్(Tweet) వైరల్‌గా మారింది.
———————————