* మైనర్లూ పారా హుషార్
* బండి నడిపితే ఇక తిప్పలు తప్పవు..
* మైనర్లను ప్రోత్సహించిన తల్లిదండ్రులపై కూడా కేసులు
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్, వరంగల్ క్రైం: మైనర్లను వాహనం నడిపే విదంగా ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ మన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా, వారిని ప్రోత్సాహస్తూ వాహనాలు అందజేసిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. మైనర్లు డ్క్రెవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనం నడిపినందుకు గాను సదరు మైనర్‌ను కోర్టులో హరజరుపర్చి న్యాయమూర్తి అదేశాల మేరకు పరిశీలన గృహంకు (అబ్జర్వేషన్ హోం) పంపబడుతుంది.
పేరెంట్స్‌పై కేసులు..
వాహన యజమానిగాని లేదా మైనర్ తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందన్నారు. డ్క్రెవింగ్ ల్కెసెన్స్ లేనివారికి వాహనం అందజేయడం కూడా నేరమని వాహనదారులు గమనించాలని, ఒక వేళ ల్కెసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వాహన యజమానికి కూడా జరిమానా విధించడంబడటంతో పాటు వాహనం స్వాధీనం చేసుకోబడుతుందని. ముఖ్యంగా మైనర్లు వాహనం నడుపుతూ ఏద్కెన ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే, మోటార్ వాహన చట్టం అనుసరించి వాహన యజమానికి మూడు సంవత్సరాల జ్కెలు శిక్ష లేదా 25వేల రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని. పట్టుబడిన మైనర్లకు 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు డ్క్రెవింగ్ ల్కెసెన్స్ ఆర్హత కోల్పోతాడని, వాహనం రిజిస్ట్రేషన్ ఒక సంవత్సర కాలం రద్దు చేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
వాహన యజమానులకు జరిమానా..!
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత జనవరి మాసం నుండి ఇప్పటి వరకు 63 మంది మైనర్లతో పాటు డ్క్రెవింగ్ ల్కెసెన్స్ లేకుండా వాహనం నడిపిన సంఘటనల్లో మొత్తం 35278 కేసులు నమోదు చేసి 12552 వాహనాలు స్వాధీనం చేసుకొవడం జరిగింది. వాహనం అందజేసిన యజమానులకు 16లక్షల47 వేల రూపాయల జరిమాన విధించడం జరిగిందని పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు. తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లకు, డ్క్రెవింగ్ ల్కెసెన్స్ లేనివారికి వాహనాలను అందజేసే చిక్కుల్లో పడవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు.
…………………………………….
