
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరున్యూస్,డెస్క్: బీజేపీ(BJP) మొదటి నుంచి బీసీ(BC)లను వ్యతిరేకిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABHAKAR) ఆరోపంచారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లడారు.తెలంగాణలో ఇప్పుడు బీసీ బద్ద వ్యతిరేకి రాంచందర్ రావు (RAMCHANDER RAO) ఆ పార్టీకి రాష్ట్రాధ్యక్షుడుగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కిషన్ రెడ్డి(KISHAN REDDY) తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపిందని పొన్నం గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎవరి ఒత్తిడి మేరకు కిషన్ రెడ్డి బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని పొన్నం అన్నారు.కిషన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రపతి వద్ద అపాయింట్ మెంట్ ఇప్పించాలని పొన్నం సూచించారు.గతంలో విపి సింగ్ (VP SINGH) మండల్ కమిషన్ తెస్తే ఆయోధ్య రామమందిరం అంటూ కమండల్ రాజకీయాలతో దేశ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారని పొన్నం విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని యూపీఏ (UPA)హయాంలో ప్రయత్నం చేస్తే యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో అడ్డకునే ప్రయత్నం చేశారని పొన్నం ఆరోపించారు. ఇప్పటికైనా బీసీ లకు న్యాయం చేయాలని 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే ముస్లిం బూచి చూసించి రిజర్వేషన్ల బిల్లు పాస్ కాకుండా చూస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
…………………………………