* పర్వేశ్‌వర్మ వైపూ బిజెపి నేతల మొగ్గు
ఆకేరున్యూస్, ఢిల్లీ: ఈ నెల 20 ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం. సిఎం అభ్యర్థి ఎంపిక నిన్ననే జరగాల్సి ఉన్నా.. దానిని రేపటికి వాయిదా వేశారు. రేపు జరిగే భేటీలో సిఎం ఎంపిక జరుగుతుందని సమాచారం. 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండటంతో నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు సమాచారం. గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు భాజపా వర్గాలు వెల్లడిరచాయి. ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
