V Vani Singapore Educational Visit
* గ్రామస్తులు, విద్యాభిమానుల హర్షం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ జడ్పీహెచ్ఎస్ బాలికల ప్రధానోపాధ్యాయురాలు వీ.వాణి తెలంగాణ విద్యాశాఖ చేపట్టిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కు ఎంపికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు డా. ఇ. నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, తొలి విడతగా సింగపూర్ వెళ్లే 29 మంది ఉపాధ్యాయుల బృందంలో ఆమె చోటు దక్కించుకున్నారు.
సెప్టెంబర్ 12, 2026 నుండి సెప్టెంబర్ 19 వరకు జరగనున్న ఈ విదేశీ పర్యటన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ బోధనా పద్ధతులను, వినూత్న విద్యా వ్యూహాలను వాణి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. విదేశీ పర్యటనలో పొందిన అనుభవాలను, ఆధునిక విద్యా సంస్కరణలను తన పాఠశాలలో అమలు చేసి, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని ప్రధానోపాధ్యాయులు వాణి తెలిపారు.
ఈ సందర్భంగా పర్యటనకు ఎంపికవ్వడం పట్ల తోటి ఉపాధ్యాయులు, ఉప్పల్ గ్రామస్తులు ,విద్యాభిమానులు , గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
