
* ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం
ఆకేరు న్యూస్, డెస్క్ : డబ్బు పిచ్చి అతడిలోని మానవత్వాన్ని మంటగలిపింది. తన అవసరాల కోసం కట్టుకున్న భార్యనే నీచంగా బ్లాక్ మెయిల్ చేసే స్థితికి దిగజారాడు.. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్రలో లోని పూణేలో చోటుచేసుకుంది. పూణె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. భార్య ప్రభుత్వంలో అధికారిణి గా పనిచేస్తోంది. కొంత కాలం అన్యోన్యంగా ఉన్నారు. కానీ భర్త తన అవసరాలు తీర్చడానికి భార్యను వేధించడం మొదలు పెట్టాడు.తనకు వచ్చే జీతం కాకుండా భార్య సంపాదించింది కూడా తనకే కావాలని వేధించసాగాడు, కారులోను, ఇంటి లోను ఇతర ఈఐఎంలు భార్య జీతం నుంచే కట్టాలని వేధించాడు. అంతే కాకుండా భార్య పుట్టింటి వాళ్లు ఇచ్చిన కట్నం సరిపోలేదని అతనంగా కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టాడు. భార్యకు తెలియకుండా పడకగదిలో, బాత్ రూంలో రహస్య కెమరాలు పెట్టాడు. ఆమె నగ్న వీడియోలను రికార్డు చేశాడు. అదనపు కట్నంతో పాటు ఈఎంఐలు కట్టాలని లేకుంటే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. భర్త వేధింపులు భరించలేక సదరు ఇల్లాలు పోలీసులను ఆశ్రయించింది. తనను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నాడని భర్త పుట్టింటి వారు కూడా తనను వేదిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పూణే పోలీసులు కేసు నమోదు చేస్తుకొని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
……………………………………………………….