* కాంగ్రెస్ పార్టీకి ఏటీిఎంగా తెలంగాణ రాష్ట్రం
* కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి
* మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ (KCR) బాటలోనే.. రేవంత్రెడ్డి (REVANTHREDDY) ప్రయాణిస్తున్నారని కిషన్రెడ్డి (KISHANREDDY) విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ల డిఎన్ఎ ఒక్కటేనని.. రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మాటలు, విమర్శలతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ లతో తెలంగాణకు ఒరిగిందేమి లేదని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటిఎంగా మారిందని ఆరోపించారు. శుక్రవారం కిషన్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన వ్యవహారం.. కలెక్టర్ పై దాడి వరకు వెళ్లిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చడం లేదని విమర్శించారు. వచ్చే రోజులన్నీ బీజేపీవేనని.. రాబోయే రోజుల్లో మీమే అధికారంలోకి రాబోతున్నామన్నారు. కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ డ్రామా ఆడుతుందని కిషన్రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రలో రేవంత్రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని కిషన్రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి అబద్దాలు చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
………………………………………………