ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి
* డీటీసీపీ (DTCP) అనుమతులతో సంస్థ ఏర్పాటు..
* ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, తొర్రూరు: రియల్ ఎస్టేట్ (Real Estate), మౌలిక సదుపాయాల (Infrastructure) రంగంలో నూతన ప్రమాణాలతో సేవలు అందించడమే లక్ష్యంగా తొర్రూరు పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన బీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ (BR Infra Developers) సంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) అనుమతులతో రూపొందించిన ఈ సంస్థను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి సంస్థ కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సంస్థ నిర్వాహకులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభమైన బీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ వ్యాపార రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని కోరారు. ఏ వ్యాపార సంస్థకైనా వినియోగదారుల నమ్మకమే ప్రధాన బలమని, దానిని నిలబెట్టుకునేలా నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధినేతలు, ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొని సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

