ఈ చిన్నోడి సమయస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేం..
చిరుతపులిని బంధించాడు.
చిన్నోడి సమయస్పూర్తిని చూసి నెటిజన్లు తెగ మెచ్చు కుంటున్నారు. వారెవ్వా .. ఏం తెగువ ప్రదర్శించాడు ఆ బాలుడు అని ఆశ్చర్యపోతున్నారు. ఇంట్లోకి ఎలుకలు వస్తేనే పిల్లలు భయం తో పరుగులు పెట్టే కాలం ఇదీ. సెల్ ఫోన్లో ఆటలు తప్ప లోక జ్ఞానం కాస్తయినా లేని పరిస్థితి.. దీనికి భిన్నంగా 12 ఏళ్ళ బాలుడు మోహిత్ ఆహిర్ ( Mohit Ahire ) మాత్రం ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా చిరుత పులిని ( Leopard ) బంధించాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ సంఘటన మహారాష్ట్ర లోని మాలేగావ్ (Malegaon )లో జరిగింది . మాలెగావ్ – నాంపూర్ రోడ్లోని సాయి వెడ్డింగ్ హాల్ బుకింగ్ ఆఫీస్లో మోహిత్ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడు కుంటున్నాడు. నేరుగా చిరుతపులి బాలుడిని గమనించకుండా లోపలికీ వచ్చేసింది. బాలుడు మాత్రం పులిని చూసాడు. ఏ మాత్రం కంగారు పడకుండా .. నిశ్శబ్దంగా బయటకు వెళ్ళి తలుపు మూసి చిరుతను బంధించాడు. వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని చిరుత పులికి మత్తు ఇంజెక్సన్లు ఇచ్చి బంధించి తీసుకెళ్ళారు. మోహిత్ తెగువ , సమయస్పూర్తి పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూనే రాజీవ్ గాంధీ జూ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చిందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
1 thought on “Breaking News – ఈ చిన్నోడి సమయస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేం.. చిరుతపులిని బంధించాడు.”