వరంగల్ అరుదైన పక్షి
*దేశంలోనే మొదటి సారి కనిపించింది
ఆకేరు న్యూస్ , వరంగల్ : వరంగల్ లో అరుదైన పక్షి దర్శనమిచ్చింది. ఇప్పటి వరకు మన దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పక్షి కానరాలేదంటున్నారు. తీతువు పిట్ట జాతికి చెందిన ఈ పక్షి పశ్చమ ఆఫ్రికా ప్రాంతంలో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. భారత దేశంలో మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదని వైల్డ్ లైఫ్ పోటోగ్రాఫర్స్ ఇందారపు నాగేశ్వర్ రావు, డాక్టర్ జగన్ అంటున్నారు. ఈ పక్షిని స్పర్ వింగ్ లాపింగ్ ( Spur winged lapwing ) గా గుర్తించారు. వరంగల్ నగర శివారు ప్రాంతంలోని అమ్మవారి పేట చెరువులో ఈ పక్షిని కనుగొన్నారు. చెరువు (Lake ) చుట్టూ కొండలూ మద్యలో ఐలాండ్ ఉండడంతో పాటు పక్షులకు అవసరమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఈ పక్షిని ఫోటోలు తీయడానికి కోల్‌కతా, పూనే, ముంబయి, కేరళ, హర్యానా, ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు, వైల్డ్‌లైఫ్ పోటోగ్రాఫర్లు అమ్మవారి పేటకు వస్తున్నారు.
డాక్టర్ జగన్ , వైల్డ్‌లైఫ్ పోటోగ్రాఫర్
- నేనే ఫోటో తీశాను
- డాక్టర్ జగన్ , వైల్డ్‌లైఫ్ పోటోగ్రాఫర్
సాధారణంగా ఇక్కడికి వచ్చి ఫోటో తీశాను. ఆపక్షిలో కొంత ప్రత్యేకత అనిపించినప్పటికీ ఇంత అరుదదైన పక్షి అని నేను ముందు గుర్తించలేక పోయాను. నిపుణులు ఇదీ .. స్పర్ వింగ్ లాపింగ్ ( Spur winged lapwing ) పక్షి అని తేల్చిన తర్వాత ఇదీ ఎంతో అరుదైన పక్షి అని తెలిసింది. చాలా సంతోషం అనిపిస్తోంది. చాలా అరుదుగా వచ్చే అవకాశం ఇదీ. అమ్మవారి పేట సరస్సును కబ్జా రాయుల్ల నుంచి రక్షించాలి. - 150 అరుదైన పక్షులు ఇక్కడ ఉన్నాయి
- ఇందారపు నాగేశ్వర్ రావు, వైల్డ్‌లైఫ్ పోటోగ్రాఫర్
అమ్మవారిపేట పక్షులకు ఒక అద్భుతమైన ప్రాంతం. అమ్మవారి పేట చెరువు పరిసరాలను ప్రభుత్వం సంరక్షించాల్సిన అవసరం ఉంది. దాదాపు 150 అరుదైన పక్షులు ఇక్కడ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ జగన్ మొదట దీన్ని ఫోటో తీశారు. నిపుణులకు పంపించడం ద్వారా ఇదీ మనదేశంలో ఎక్కడా లేని అరుదైన పక్షి స్పర్ వింగ్ లాపింగ్ గా గుర్తించాము. చెరువులు కబ్జాలకు గురికావడం, కొంత మంది వేటగాళ్ళు అక్రమంగా పక్షులను చంపేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. అదే విదంగా చుట్టూ పక్కల క్వారీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.