బ్రేకింగ్ న్యూస్
* ఎయిర్ షోలో దుర్ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : దుబాయ్ ఎయిర్ షోలో భారత యుద్ధ విమానం కుప్పకూలింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ (Tejas) యుద్ధ విమానం కూలిపోవడం కలకలం రేపింది. కూలిన వెంటనే మంటలు వ్యాపించి విమానం దగ్ధమైంది. భారత్ ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన తేజస్ యుద్ధ విమానం భారత కాల మానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఎయిర్ షో(Air Show) లో యుద్ధ విమానం కూలి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందారా? సురక్షితంగా బయటపడ్డారా అనేది తెలియాల్సి ఉంది. విమాన ప్రమాదంపై అధికారిక ప్రకటన వెలువడ లేదు
