Breastfeeding Week Ramannapet
* శిశువు కి తల్లి పాలే అమృతం లాంటివి సీ డి పి వో విద్య
ఆకేరు న్యూస్, రామన్నపేట :
వరంగల్ జిల్లా రామన్నపేటలోని ప్రియదర్శిని కాలనీ అంగన్వాడీ సెంటర్ లో గురువారం ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) విద్య, మాట్లాడుతూ శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలే అమృతం లాంటివని, బిడ్డకు పట్టే మొదటి పాలు (ముర్రుపాలు) టీకా వలె రక్షణనిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీడీపీవో విద్య తల్లిపాల ప్రాముఖ్యతపై పలు కీలక విషయాలను వెల్లడించారు
మొదటి ఆరు నెలలు అత్యంత కీలకం: బిడ్డ జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టాలని, ఆరు నెలల వయసు వరకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.
వ్యాధి నిరోధక శక్తి: తల్లిపాలలో ఉండే పోషకాలు, యాంటీబాడీలు పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి.
తల్లి ఆరోగ్యానికీ మేలు: బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశువుకే కాకుండా తల్లికి కూడా గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
అనంతరం సూపర్ వైజర్ పుణ్యవతి, మాట్లాడుతూ తల్లిపాల విశిష్టతపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరి, 29వ డివిజన్ అంగన్వాడీ టీచర్స్ ఎండి నసీం, ఏ రమాదేవి, డి సమత, ఏ పద్మ టి పద్మ, సిహెచ్ లలిత, పి స్వరూపారాణి, ఆయాలు ఆశాలు తల్లులు తదితరులు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
