
బద్రీనాథ్ జాతీయ రహదారి లో విరిగిపడ్డ కొండచరియలు
– చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరాది రాష్ట్రా (Northern states) లను కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు (Landslides) విరిగిపడుతుండటంతో కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు (Roads are closed). చమోలి జిల్లా (Chamoli District) లో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైవే మూసివేతతో బద్రీనాథ్ (Badrinath), జోషిమఠ్ (Joshimath), నీతి (Neethi), మన (Mana), తపోవన్ (Tapovan), మలారి (Malari), లత (Latha), రాయిని Raiini, పాండుకేశ్వర్ (Pandukeshwar), హేమకుండ్ సాహిబ్ (Hemakund Sahib) లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు (Border Road Organization Officers) తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో (In five districts) భారీ వర్షాల హెచ్చరికల (Heavy rain warnings) దృష్ట్యా ఛార్‌దామ్ (Chardham) యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
——————————