* గొడవతో సంబంధం లేని వారినీ అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణలు
* ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన?
* అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?
* బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
* కొడంగల్ లో జరిగింది ప్రభుత్వంపై దాడి : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా(VIKARABAD DISTRICT) కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో రైతుల ఆరెస్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అరెస్టులను నిరసిస్తూ బీఆర్ ఎస్(BRS) ఆందోళనలు చేపడుతోంది. గొడవతో సంబంధం లేనివారినీ అరెస్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చలో కొడంగల్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ వెళ్తున్న బీఆర్ ఎస్ నేతలను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డగించారు. మన్నెగూడ, పరిగి, బొంరాస్ పేటలో పోలీసు మోహరించారు. బీఆర్ ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డగించి, పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కాగా, రైతుల అరెస్ట్ పై ఎక్స్ వేదికగా బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పందించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? అని ప్రశ్నించారు. ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?, అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? అని ప్రశ్నించారు. ‘మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు రైతులను అరెస్టు చేస్తారా?’ అని ధ్వజమెత్తారు. రైతుల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి మద్దతు తెలిపారు. కొడంగల్ లో జరిగింది ప్రభుత్వంపై దాడి అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(EX MINISTER JAGADEESHREDDY) అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని వెల్లడించారు.
………………………………..