* లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమస్యలపై ఆరా
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్(WARANGAL LAXMIPURAM VEGITABLE MARKET)లో పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(KONDA SUREKHA) ఈరోజు పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వ్యాపారులను, ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో అక్రమంగా కేటాయించిన దుకాణాలను తొలగించి, అర్హులకు కేటాయించాలన్నారు. ఈ మేరకు ఒకటి కమిటీ వేయాలన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్వినీ, మేయర్ గుండు సుధారాణి(MAYOR GUNDU SUDHA RANI) తదితరులు ఉన్నారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
