Naga Jyothi
* బడే నాగజ్యోతి
Naga Jyothi| ఆకేరు న్యూస్, ములుగు: జిల్లావ్యాప్తంగా పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేయాలని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ములుగు మండల పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు సనికొమ్ము రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, గ్రామస్థాయి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నాగజ్యోతి తెలిపారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభించేలా నాయకత్వం కృషి చేస్తుందని అన్నారు.
హామీల అమలుపై ప్రజలకు వివరించాలి
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని నాగజ్యోతి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితి, ములుగు నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై వాస్తవ సమాచారాన్ని సేకరించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
గ్రామ, మండల స్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ములుగులో బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు సనికొమ్ము రమేష్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కోగిల లక్ష్మీ, బైకని సాగర్, మాజీ ఎంపీపీ మురళి, సర్పంచులు వీరబోయిన రాజేందర్, తప్పెట్ల రాజేందర్, దాసరి సరిత రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోరం సంతోష్, కుడుముల లక్ష్మీనారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
