* కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకురావాలని సీఎం ప్రయత్నం
* ఖజానా ఖాళీ చేసి మా చేతుల్లో పెట్టిన్రు
* అయినా సీఎం, మంత్రులు సంపదను సృష్టించి అభివృద్ధి చేపడుతున్రు
* ఆరు గ్యారెంటీల్లో మెజారిటీ అమలు చేశాం
* రూపాయి పనిచేసి.. చారాణ కూడా మేం చెప్పుకోవట్లే
* కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి చెందొద్దని బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకురావాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షం అడ్డుపడుతోందని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖజానా ఖాళీ చేసి మా చేతుల్లో పెట్టిన్రు అని, అయినా సీఎం, మంత్రులు సంపదను సృష్టించి అభివృద్ధి చేపడుతున్రు అని వివరించారు. ఆరు గ్యారెంటీల్లో మెజారిటీ అమలు చేశామన్నారు. రూపాయి పనిచేసి.. చారాణ కూడా మేం చెప్పుకోవట్లేదన్నారు. కొడంగల్ అభివీద్ధికి ప్లానింగ్ ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు నెలకు 2500 త్వరలో ఇస్తామని వివరించారు. 4 వేల పెన్సన్ కూడా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎ స్ దొంగల ముఠా సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని విమర్శించారు.
…………………………………………………