Errabelli Dayakar Rao BRS Protest in rayaparthy
* బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
* కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆరఎస్ నిరసన
* 420 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటు, ర్యాలీ
ఆకేరు న్యూస్, రాయపర్తి :
బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా మండల కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… “అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మహిళలను, విద్యార్థులను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. హామీలన్నీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదు” అని స్పష్టం చేశారు.
దయాకర్ రావు నేతృత్వంలో సుమారు 1000 మంది మహిళలు హాజరయ్యరు. ఈ కార్యక్రమంలో మహిళల కోలాటాలు, భజనలు, డీజే డప్పుచప్పుళ్లు, నృత్యాలతో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ. 2,500 జీవన భృతి, మహాలక్ష్మి పథకం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి సహాయం, అర్హులైన విద్యార్థినులకు స్కూటర్ల పంపిణీ వంటి హామీలను విస్మరించిందని నాయకులు మండిపడ్డారు.
* రహదారి పైనే భోజనం చేసిన ఎర్రెబెల్లి, పార్టీ శ్రేణులు
కాంగ్రెస్ ఇచ్చి నెరవేర్చని 420 హామీలకు నిరసనగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మహిళలు బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలో మహిళలతో కలిసి వంట-వార్పు చేపట్టి నిరసన తెలిపారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం వెంటనే తన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసనలో పాల్గొన్న మహిళలతో కలిసి రహదారిపైనే భోజనం చేశారు. నిరసనలో ఎసఆరఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక బీఆరఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
