Congress 1000 Days Chinnapendyal
* చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు
* చిన్నపెండ్యాలలో వెయ్యి రోజుల విజయోత్సవ ర్యాలీ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు అన్నారు. పార్టీ వెయ్యి రోజుల పాలనపై జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాల్లో నియోజకవర్గం ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కళ్ల ముందు కొట్టొచ్చినట్టు కనబడుతున్న ప్రతిపక్షాలకు కనపడని విధంగా విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. బీఆరఎస్, బీజేపీ పార్టీలు వాస్తవాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని ఆయన కోరారు. మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు అధ్యక్షతన బస్టాండ్ నుంచి కచ్చిరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు గడ్డమీద సురేష్, సర్పంచులు మేనక సుధాకర్, లక్ష్మి ఉమ్ల, నవీన్, నరసింహారెడ్డి, శాతబోయిన రాజు, నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, గుంపుల రవీందర్ రెడ్డి, నీల రాజు, బొడ్డు సమ్మయ్య, ఇల్లందుల హరిబాబు, ఇల్లందుల విజయ్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
