వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్
* డాక్టర్ రాజయ్యకు మరో సారీ… !
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
వరంగల్ పార్లమెంట్ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ సుధీర్ కుమార్ ఇపుడు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో సుధీర్ క్రియాశీలక భూమిక పోషించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ విద్యాధికుడు. సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారని బీఆర్ ఎస్ పార్టీ నేతలు చెప్పారు.
డాక్టర్ రాజయ్యకు మరో ” సారీ “..!
గత అసెంబ్లీ ఎన్నికల ముందు స్టేషన్ ఘన్ పూర్ రాష్ట్ర రైతు బంధు కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం నిరాకరించింది. కడియం శ్రీహరి బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో డాక్టర్ రాజయ్య బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లుగా తెలిసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యకు బీఆర్ ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించారు. అనంతర పరిణామాల్లో కడియం శ్రీహరి, కావ్యలు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యకు అవకాశం దక్కింది. దీంతో మరోసారి డాక్టర్ రాజయ్య బీఆర్ ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించినట్టే అనిపించాయి. ఏకంగా వరంగల్ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రాజయ్యను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫామ్ హౌజ్‌కు హుటాహుటిన బయలు దేరి వెళ్ళారు. ఏం జరిగిందో ఏమో కాని .అనంతరం డాక్టర్ రాజయ్యకు కాకుండా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. గత మూడు నెలలుగా డాక్టర్ రాజయ్య ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోక అటు బీఆర్ ఎస్ పార్టీలో టికెట్ దక్కక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
—————————————–