* కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్రబడ్జెట్ (Union Budget) లో తెలంగాణ రాష్ట్రాని (Telangana state) కి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) మండిపడ్డారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. 48.21 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని, తెలుగు కోడలైన నిర్మలమ్మ (Nirmalamma) తెలంగాణకు కేటాయించింది శూన్యమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ (KCR) కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం. ములుగు యూనివర్సిటీ (Mulugu University) కి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ (Bayyaram Steel Factory).. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Railway Coach Factory in Kazipet) ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు అని కేటీఆర్(KTR) తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) వంటి జాతీయ పార్టీలను గెలిపిస్తే, రాష్ట్రానికి ఏం ఒనగూరిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని విమర్శించారు. గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వారని తెలిపారు.
————————-