Bulgaria Road Accident
* 86 వాహనాలు ధ్వంసం.. 12 మంది మృతి
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : బల్గేరియాలో ఉదయం దట్టమైన పొగమంచు తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డుపై దృశ్యమానత (విజిబిలిటీ) శూన్యంగా మారడంతో ఒకదానివెనుక ఒకటి ఏకంగా 86 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. అత్యంత దారుణంగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాంబోల్ సమీపంలో చోటుచేసుకున్న ఘోరం
బల్గేరియా రాజధాని సోఫియాను, కీలకమైన బుర్గాస్ ఓడరేవు నగరాన్ని అనుసంధానించే బిజీ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.
తెల్లవారుజామున యాంబోల్ ప్రాంతం సమీపంలో ఒక్కసారిగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం పూట కావడం, వాహనాల వేగం ఎక్కువగా ఉండటంతో ముందున్న వాహనాలు సరిగ్గా కనిపించక డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకే ప్రదేశంలో ఇరువైపులా ప్రయాణిస్తున్న 86 వాహనాలు – కార్లు, లారీలు, బస్సులు ఒకదానినొకటి అతి వేగంతో ఢీకొట్టాయి.
* అక్కడికక్కడే 10 మంది మృతి
ప్రమాద తీవ్రతకు వాహనాలు పూర్తిగాజ్జుజ్జుయ్యాయి. ఈ ఘోర ఘటనలో 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్లు, అంబులెన్సులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది.
* మరొక 46 మందికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలావస్థకు చేరిన వాహనాల నుంచి బాధితులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం కారణంగా సదరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి, రవాణాను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

